జాతీయ విద్యావిధానం అమలు చేయాలి | Governor Tamilisai Soundararajan Attends Potti Sreeramulu University Convocation | Sakshi
Sakshi News home page

జాతీయ విద్యావిధానం అమలు చేయాలి

Jul 21 2022 1:34 AM | Updated on Jul 21 2022 9:23 AM

Governor Tamilisai Soundararajan Attends Potti Sreeramulu University Convocation - Sakshi

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): జాతీయ విద్యావిధానాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 15వ స్నాతకోత్సవాలను రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధానం అమలు చేయడం వల్ల విద్యార్థుల్లో స్వయం ఉపాధి పెంపొందించడంతో పాటు పోటీ ప్రపంచంలో తట్టుకునే శక్తి కలుగుతోందన్నారు.

వివిధ అంశాలపై పరిశోధనలు పూర్తి చేసి డాక్టరేట్‌ పట్టా పొందిన విద్యార్థులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య మాట్లాడుతూ.. పాశ్చాత్య భాషలు భారతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ప్రాంతీయ భాషలను క్షీణింపజేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టి.కిషన్‌రావు, రిజిస్ట్రార్‌ భట్టు రమేశ్‌లతో పాటు వివిధ రంగాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. 

బంగారు పతకాల ప్రదానం
కరోనా కారణంగా రెండేళ్లుగా పట్టాల ప్రదానం నిలిచిపోవడంతో గత విద్యార్థులకు కూడా ఈ ఏడాదే పట్టాలను ప్రదానం చేశారు. జస్టిస్‌ చంద్రయ్య, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరి కృష్ణలతో పాటు పలువురు ప్రముఖులు డాక్టరేట్‌ పట్టాను అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌ పూర్తి చేసిన 21 మంది, పీహెచ్‌డీ పూర్తిచేసిన 73 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు.  పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. జస్టిస్‌ చంద్రయ్యకు  డాక్టరేట్‌ ప్రదానం చేస్తున్న గవర్నర్‌ తమిళిసై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement