జూబ్లీహిల్స్‌ ఘటన మరువకముందే మరో దారుణం.. పాతబస్తీలో గ్యాంగ్‌ రేప్‌!

Gang Rape On Girl At OYO Hotel At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. కొందరు దుండగులు.. అమ్మాయి(13)ని కిడ్నాప్‌ చేసిన, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా, జూబీహిల్స్‌ మైనర్‌ అత్యాచార ఘటన ఇంకా మరువకముందే ఇలా మరో ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. 

వివరాల ప్రకారం.. దబీర్‌పురా పోలీస​్‌ స్టేషన్‌ పరిధిలో సెప్టెంబర్‌ 12వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఓ మైనర్‌ మెడికల్‌ షాపునకు వెళ్లిందేకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ సమయంలో ఇద్దరు యువకులు.. ఆమెను కిడ్నాప్‌ చేసి అదే ప్రాంతంలో ఉన్న ఓయో హోటల్‌ రూమ్‌కు తరలించారు. అక్కడే రెండు రోజులు ఉంచి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం.. బాధితురాలని చాదర్‌ఘాట్‌ వదిలివెళ్లారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ఇంటికి తీసుకువెళ్లారు. కాగా, అత్యాచారం సందర్భంగా బాధితురాలికి మత్తు మందు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. బాధితురాలు కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను రవేష్‌ మెహదీ, మహ్మదుల్లాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కిడ్నాప్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ, ఓయో రూమ్‌కు తరలిస్తున్న ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, బాధితురాలు మైనర్‌ కావడంతో భరోసా సెంటర్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడే బాధితురాలు, ఆమె పేరెంట్స్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top