Gajwel మూడు నెలల్లో గజ్వేల్‌కు గూడ్స్‌ రైళ్లు

Gajwel Will Get Soon Goods Train In Three Months - Sakshi

తుది దశకు చేరుకున్న గూడ్సు షెడ్డు పనులు

స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు కసరత్తు

గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నిబంధనలతో గజ్వేల్‌కు ప్రయాణికుల రైలు నడపటంలో ఆలస్యం జరుగుతున్నప్పటికీ, మరో మూడు నెలల్లో సరుకు రవాణా రైలు ప్రారంభం కాబోతోంది. ఇంతకాలం అటు సిద్దిపేట మొదలు గజ్వేల్‌ పరిసర ప్రాంతాల్లో పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గాన్నే వినియోగిస్తున్నారు. ఇప్పుడు తొలిసారి రైలు మార్గం అనుసంధానం కాబోతోంది.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం

గజ్వేల్‌ వరకు రైలు మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కానీ కోవిడ్‌ వల్ల దేశవ్యాప్తంగా ప్యాసింజర్‌ రైళ్లను నడపటం లేదు. ఈపాటికే ప్రయాణికుల రైలు సర్వీసు గజ్వేల్‌ వరకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కారణంతో మొదలు కాలేదు. అయితే వీలైనంత తొందరలో గూడ్సు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

గూడ్సు షెడ్డు నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి గూడ్సు రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. సమీపంలోని ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను లారీల ద్వారా గజ్వేల్‌ వరకు తరలిస్తే అక్కడి నుంచి గూడ్సు రైళ్లలో వాటిని తరలించొచ్చు. గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌ను గురువారం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ డీఆర్‌ఎం శరత్‌ చంద్రాయన్‌ తనిఖీ చేశారు. డిప్యూటీ సీఈ (కన్‌స్ట్రక్షన్‌) సదర్మ దేవరాయ, అధికారులులతో కలిసి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.   
చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top