చిరుత కాదు..కుక్క పాదమే

gachibowli cheetah incident, forest  department says thats dog - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు సమీపంలోని రొడామిస్త్రీ కాలేజీ పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందన్న ప్రచారంపై అటవీశాఖ స్పందించింది. అక్కడ తమకు చిరుత సంచారంపై ఎలాంటి ఆధారాలు లభించలేదని అటవీశాఖ స్పష్టంచేసింది. చిరుత జాడ కనిపెట్టేందుకు తాము ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో, సమీప ప్రాంతాల్లో సేకరించిన పాదముద్రల్లోనూ కుక్కల ఆనవాళ్లు తప్ప చిరుత సమాచారం ఏదీ లభ్యం కాలేదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 8న అక్కడి ఓ మహిళ చిరుతపులిని చూసినట్లుగా ఫిర్యాదు చేశారని, కానీ ఆ పరిసరాల్లో 15 ఎకరాల్లోని అటవీ ప్రాంతంలో తమకు ఎక్కడా చిరుత పాదముద్రలు కనిపించలేదని వెల్లడించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top