Free Chai Biscuit At "Loo Cafe" In Hyderabad Banjara Hills | ‘ఫ్రీ చాయ్‌ బిస్కెట్‌’ - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ‘ఫ్రీ చాయ్‌ బిస్కెట్‌’ 

Mar 16 2021 12:55 PM | Updated on Mar 16 2021 7:14 PM

Free Chai, Biscuit Cafe In Banjara Hills - Sakshi

నగరంలో వినూత్నంగా ‘లూ కేఫ్‌’ పేరుతో మొట్టమొదటి ఫ్రీ చాయ్, బిస్కెట్‌ కౌంటర్‌ ప్రారంభమైనది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వినూత్నంగా ‘లూ కేఫ్‌’ పేరుతో మొట్టమొదటి ఫ్రీ చాయ్, బిస్కెట్‌ కౌంటర్‌ ప్రారంభమైనది. బంజారాహిల్స్‌‌ కేబీఆర్‌ పార్కుకి ఎదురుగా ప్రారంభించిన ఈ స్టాల్‌ను రవీంద్రనాథ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇగ్జోరా కార్పొరేట్‌ సేవల సీఎస్‌ఆర్‌ నిధులతో  ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా లూ కేఫ్‌ హెడ్‌ అభిషేక్‌ బంది వాడేకర్‌ మాట్లాడుతూ.. కేబీఅర్‌ పార్కు, దానికి సమీపంలో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ పరిసర ప్రాంతాలకు ప్రతి నిత్యం చాలా మంది నగరవాసులు వస్తుంటారు. వారందరికి ఉచితంగా చాయ్‌ బిస్కెట్, మంచి నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కౌంటర్‌ ను ప్రారంభించామని తెలిపారు. అంతే కాకుండా ఇక్కడ మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా పరిశుభ్రమైన వాష్‌ రూమ్‌ అందుబాటులో ఉన్నాయన్నారు.

చదవండి: మంచి గవర్నర్‌... భోజనం పెట్టి; ల్యాప్‌టాప్‌ ఇచ్చి

Advertisement
 
Advertisement
Advertisement