కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అగ్నిమాపకశాఖ అప్రమత్తం  | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అగ్నిమాపకశాఖ అప్రమత్తం 

Published Sun, Dec 3 2023 2:52 AM

Fire Department alerted at counting centers: telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అగ్నిప్రమాదం సంభవించినా వెంటనే అప్రమత్తం అయ్యేలా అగ్నిమాపక శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 119 నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఫైర్‌ టెండర్లు, మిస్ట్‌ బుల్లెట్లు, మంటలు ఆర్పే పరికరాలతో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచినట్టు అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు.

అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలను తనిఖీ చేసుకున్నారని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement