సాక్షి, వికారాబాద్ జిల్లా: పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి ఫర్నేస్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆలీ, రషీద్ అనే ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
వారిని సోమాజిగూడలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ ఆలీ మృతి చెందాడు. రషీద్ చికిత్స పొందుతున్నాడు. నిందితులు ప్రొసీజర్ ప్రకారం పని చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పరిగి ఎస్సై మోహన్ కృష్ణ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


