చదువులు సాగేదెలా?

Even After 6 Months Only 69 Percent Books Uniforms Still Not Received  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు బడుల్లో పాఠ్య పుస్తకాలే కాదు... ఏకరూప దుస్తులు సైతం అందని ద్రాక్షగా తయారయ్యాయి,  ఒకవైపు విద్యార్థులకు పూర్తిస్థాయి పాఠ్య పుస్తకాలు లేకుండానే  చదువులు సాగుతుండగా.. యూనిఫాంల జాడ కూడా లేకుండా పోయింది. 2022– 23 విద్యా సంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడిచినా 60 శాతం మించి పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదని అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రధాన ప్రచురణ కేంద్రం నుంచి గోదాములకే అరకొర స్టాక్‌ వచ్చి చేరడంతో పాఠశాలలకు పుస్తకాల సరఫరా అంతంత మాత్రంగా ఉంది. ఇప్పటి వరకు వచి్చన వాటిలో సైతం ఏ ఒక్క తరగతికి సైతం పూర్తి స్థాయి పుస్తకాల సెట్‌ అందలేనట్లు తెలుస్తోంది. విద్యా  సంవత్సరం ప్రారంభంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యం కావడంతో అప్పటిదాకా బ్రిడ్జి కోర్సులు నిర్వహించారు. అనంతరం బోధన ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయి పాఠ్య పుస్తకాల కొరత వెంటాడుతోంది. 

పాత పుస్తకాలతోనే.. 
గత విద్యా సంవత్సరం  ప్రభుత్వ బడుల్లో చాలా తరగతులకు  సగం పుస్తకాలే పంపిణీ చేశారు. పాత వాటిని సైతం ఈసారి సేకరించి  సర్దుబాటు చేసినా విద్యార్థులందరికీ సరిపోని పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో  అయిదుగురు విద్యార్థులను ఒక గ్రూప్‌గా చేసి వారికి ఒక్కో పాఠ్య పుస్తకాన్ని ఇచ్చి సర్దుబాటు చేశారు.

దీంతో చేతిలో పుస్తకాలు లేక విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. తోటి విద్యార్థుల పుస్తకాలపై ఆధారపడి చదువులు కొనసాగించడం ఇబ్బందిగా తయారైంది. తరగతి గదిలో బోధన తర్వాత ఇంటివద్ద హోంవర్కు సమస్యగా తయారైంది. పాఠ్య పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శాపంగా తయారైంది. 

24.73 లక్షలపైనే..  
గ్రేటర్‌లోని హైదరాబాద్‌–రంగారెడ్డి–మేడ్చల్‌ జిల్లా పరిధిలోని ప్రభుత్వ బడులకు సుమారు 24.73 లక్షల పాఠ్యపుస్తకాల అవసరం ఉంటాయని విద్యాశాఖాధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఇండెంట్‌ పెట్టారు. అందులో  60 శాతం మాత్రమే ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి గోదాములకు చేరాయి. అందులో సైతం తరగతులకు సంబ ంధించిన అన్ని పాఠ్యపుస్తకాలు అందలేదు. ఈ విద్యా సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో ఒకే సా రి ఇంగ్లి‹Ù, తెలుగు మీడియం పుస్తకాల ప్రచురణ తలపెట్టడంతో పూర్తి స్థాయి కోటాకు ఆటంకంగా తయారైంది. 

ఊసే లేని యూనిఫాంలు.. 
సర్కారు బడుల విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫాంల ఊసే లేకుండా పోయింది. విద్యార్థులకు రెండు జతల చొప్పున ఉచితంగా యూనిఫాంలను అందించాల్సి ఉంది. సాధారణంగా  వేసవి సెలవుల్లోనే వీటికి అవసరమైన వ్రస్తాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి, ఆయా జిల్లాలు, మండలాల వారీగా స్కూళ్లకు అందించాలి. ఈ ఏడాది యూనిఫాంలకు అవసరమైన వస్త్రం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో సకాలంలో దుస్తుల పంపిణీ  ప్రశ్నార్థకంగా మారింది.   

(చదవండి: ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top