Munugode Bypoll Results: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి: వికాస్‌రాజ్‌

EC Chief officer Vikas Raj Gives Clarity on Munugode Counting Delay - Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఆలస్యంపై సీఈఓ వికాస్‌రాజ్‌ స్పందించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందునే కౌంటింగ్‌ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు.

'ప్రతి టేబుల్‌ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారు. ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తున్నాం. అయితే మిగత రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువమంది పోటీలో ఉండటంతోనే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి. అందుకే ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయడానికి ఆలస్యమవుతోందని' సీఈఓ వికాస్‌రాజ్‌ చెప్పారు. 

ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు ఐదురౌండ్ల కౌంటింగ్‌ ముగిసింది. దాదాపు 75వేల ఓట్లు లెక్కింపు పూర్తి కాగా, ఇంకా లక్షన్నర ఓట్లు లెక్కించాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 5 రౌండ్లు ముగిసే సమయానికి 1430 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

చదవండి: (Munugode Round Wise Results Live: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top