Dr Jnanesh Thacker: 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి సర్జరీలు

Dr Jnanesh Thacker Perform More Than 500 Lung And Heart Transplant - Sakshi

యశోద ఆస్పత్రి డాక్టర్‌ జ్ఞానేశ్‌ అరుదైన ఘనత 

రాంగోపాల్‌పేట్‌/సాక్షి, హైదరాబాద్‌: యశోద ఆస్పత్రికి చెందిన సీనియర్‌ హార్ట్‌–లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జికల్‌ డైరెక్టర్‌ జ్ఞానేశ్‌ టక్కర్‌ 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేసి అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతితక్కువ మంది వైద్యుల్లో ఒకరిగా నిలిచారు. యూఎస్‌లో ప్రముఖ వైద్యుల్లో ఒకరిగా కొనసాగుతున్న డాక్టర్‌ జ్ఞానేశ్‌ భారత్‌కు వచ్చి తొలిసారి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. మొదటిసారిగా చిన్న గాటుతో డబుల్‌ ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స కూడా ఆయనే చేశారు.
(చదవండి: ఉన్నట్టుండి కాళ్లు చచ్చుబడ్డాయి, ఆస్పత్రికి తీసుకెళ్లగా)

కాగా, అరుదైన ఘనత సాధించడంతో బుధవారం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో కేక్‌ కట్‌ చేసిన జ్ఞానేశ్‌ను ఘనంగా సత్కరించారు. ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి మాట్లాడుతూ.. ‘యశోద’వైద్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. కోవిడ్‌ సమయంలో తీవ్ర అనారోగ్యం బారిన పడిన రోగుల ప్రాణాలు కాపాడిందని తెలిపారు. ముఖ్యంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విషమ పరిస్థితుల్లో ఎయిర్‌ అంబులెన్స్‌లో వచి్చన వందకు పైగా రోగులకు అత్యాధునిక వైద్యం అందించి రక్షించినట్లు వివరించారు.   

చదవండి: వైద్యురాలికి ఊపిరితిత్తుల మార్పిడి.. లక్నో టు హైదరాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top