దోస్త్: నేటి నుంచి వచ్చే నెల 2 వరకు స్పెషల్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా నవంబర్ 27 నుంచి వచ్చే నెల 2 వరకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) కన్వీనర్ ప్రొ. ఆర్.లింబాద్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ల కోసం ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు వచ్చే నెల 4న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 4 నుంచి 7 వరకు సంబంధిత కాలేజీల్లో సీసీఓటీపీ, తాత్కాలిక కేటాయింపు లేఖ, ఇతర అమసరమైన ప్రతాలను తీసుకెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని సీటు పొందనివారు, రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇవ్వనివారు, సీటు పొంది కాలేజీ కన్ఫర్మ్ కాని విద్యార్థులు ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు అర్హులని తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి