
కేయూ క్యాంపస్(వరంగల్): కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో పరిశోధకురాలు ఎ.సమతకు యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఏ ప్రాస్పెక్టివ్ స్టడీ ఆన్ రోల్ ఆఫ్ మెట్‌ఫార్మిన్ అండ్ మయోఅయేనిసిటాల్ ఇన్ మేనేజ్‌మెంట్ ఆఫ్‌పాలిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్దాంత గ్రంథానికి సమతకు డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. కేయూ ఫార్మసీ కళాశాల డీన్ గాదె సమ్మయ్య పర్యవేక్షణలో సమత తన పీహెచ్‌డీ పూర్తి చేసింది.