భవిష్యత్‌లో పెను సవాల్‌.. ఠాణాకో సైబర్‌ క్రైమ్‌ టీమ్‌

Cyber ​​Crime Teams To Set up in Every Police Station: CV Anand - Sakshi

దర్యాప్తునకు అవసరమైన ఉపకరణాలు

భవిష్యత్‌లో సైబర్‌ నేరాలు పెను సవాల్‌ 

హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సిటీలో సగటున రోజుకు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతుంటే వాటిలో 20 శాతం సైబర్‌ నేరాలకు సంబంధించినవే అని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. రానున్న రోజుల్లో ఈ నేరాలను పెను సవాల్‌గా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ సైబర్‌ క్రైమ్‌ టీమ్స్‌ ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నామని తెలిపారు. 

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘చోరీలు, స్నాచింగ్స్, దోపిడీలు వంటి నేరాలు తగ్గుతుండగా సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు ప్రతి వ్యాపార, ఇతర లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో ఈ నేరాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సైబర్‌ క్రైమ్‌ నిరోధానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు బాధ్యతలు స్వీకరించిన రోజే స్పష్టం చేశాం. ఇందులో భాగంగా ప్రతి ఠాణాలోనూ ఎస్సై, నలుగురు హెడ్‌–కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లకు సైబర్‌ క్రైమ్‌ టీమ్స్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. వీరికి అవసరమైన ఉపకరణాలు, శిక్షణ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. పేజీ పేమెంట్‌ గేట్‌వే సంస్థలో జరిగిన సైబర్‌ నేరం దర్యాప్తు హ్యాకింగ్‌ కేసులకు పాఠంగా పనికి వస్తుంది. మహేష్‌ బ్యాంక్‌ కేసు కూడా కొంత అనుభవాన్ని ఇచ్చింది’ అని అన్నారు.  

ఆ మూడు సంస్థల విషయం ఆర్బీఐ దృష్టికి... 
‘పేమెంట్‌ గేట్‌వేలనే హ్యాక్‌ చేసిన నిందితుడు దినేష్‌  మూడేళ్లలో దాదాపు రూ.3 కోట్లు స్వాహా చేశాడు. ఇతడి వల్ల సైబర్‌ నేరాల బారినపడిన పేజీ, బెస్ట్‌ పే, మహాగ్రామ్‌ల సర్వర్లలో అనేక లోపాలున్నాయి. పేజీ సంస్థ అడ్మిన్‌ యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్స్‌ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉంది. వీటి  విషయాన్ని ఆర్బీఐకి లేఖ ద్వారా తెలియజేస్తాం.  

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top