కరోనా మృతదేహాలను ఆలింగనం.. ఆపై అంత్యక్రియలు

Coronavirus: Person From Khammam Makes 700 People Funerals - Sakshi

సాక్షి, ఖమ్మం: మహమ్మారి సోకి చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకు సేవాభావంతో కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో అంతిమ సంస్కారం జరిపిస్తున్నారు ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్‌ నిర్వాహకులు డాక్టర్‌ అన్నం శ్రీనివాసరావు. దైవ కార్యంగా భావిస్తూ కోవిడ్‌ తొలి, రెండో దశల్లో ఇప్పటివరకు 700 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో..ఈ మహమ్మారికి భయపడి కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు వచ్చేందుకు వెనకడుగు వేసిన వేళ..అన్నం తన బృందంతో కలిసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. మొదటి వేవ్‌లో ఉభయ జిల్లాల్లో 500మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు.

వైరస్‌ ఉధృతి ఆందోళనలో ఉన్న ప్రజలు తమ గ్రామాలకు మృత దేహాలను తీసుకురానీయకుండా రోడ్లపై కంపలేసి అడ్డుకుంటే..ఖమ్మం ప్రకాష్‌నగర్, కాల్వొడ్డుకు చేర్చి అంతిమ సంస్కారం జరిపించారు. కాటికాపర్లు నిరాకరించిన సమయంలో కూడా ఒక్కరోజులో 13మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన సందర్భాలున్నాయి. కరోనా రెండో దశలో పొరుగున ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 200 మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మొదటివేవ్‌తో పోలిస్తే ఈసారి ప్రజల్లో కొంత అవగాహన పెరగడంతో ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతరుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రతిరోజూ అన్నం సేవా ఫౌండేషన్‌కు కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం 10కి పైగా ఫోన్‌ కాల్స్‌ వస్తుండడం విశేషం.

అన్నం శ్రీనివాసరావుకు భార్య విజయలక్ష్మి, కుమారుడు అమరేశ్వరరావు, కూతురు హేమలతల సహకారం మరువలేనిది. 16 ఏళ్ల వయసున్న తన మనవరాలు శ్రీదేవి కూడా తాతను అనుసరిస్తూ అంత్యక్రియల్లో పొల్గొంటోంది. తన బృందంలోని పదిహేను మందిలో ఐదుగురు మహిళలు, పది మంది పురుషులున్నారు. తొలి నాళ్లలో అంత్యక్రియలకు రావడానికి భయపడిన వీరు అన్నంను చూసి ఇప్పుడు ఎక్కడ అంత్యక్రియలు ఉంటే అక్కడికి ఆయనను అనుసరిస్తుండడం విశేషం.

ఆలింగనం చేసుకుని ధైర్యం..
చనిపోయాక కొన్ని గంటల తర్వాత మృతదేహం ద్వారా వైరస్‌ వ్యాపించదని అన్నం శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. ఖమ్మంలో..కృష్ణాజిల్లా మైలవరం మండలానికి చెందిన వ్యక్తి  మరణించగా..మృతదేహాన్ని ఆలింగనం చేసుకుని కుటుంబ సభ్యులను భయపడొద్దని ధైర్యం చెప్పారు. అలాగే నేలకొండపల్లి ముజ్జుగూడెం గ్రామంలో, తల్లాడ మండలం మల్లారం..ఇంకా అనేక చోట్ల చాలా మృత దేహాలను హత్తుకొని.. కరోనా రాదని ప్రచారం చేస్తూనే ఉన్నారు. 

 


చదవండి: లాక్‌డౌన్‌, బడులు, కర్ఫ్యూనే మంత్రివర్గ అజెండా

ఘోరం: చితి పేర్చుకుని రైతు సజీవదహనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-06-2021
Jun 19, 2021, 08:29 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడిలో కీలకంగా పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల భద్రత, సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని...
19-06-2021
Jun 19, 2021, 08:01 IST
సాక్షి బెంగళూరు: లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన కర్ణాటక సీఎం యడియూరప్ప కుమారుడు...
19-06-2021
Jun 19, 2021, 05:20 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌–19 థర్డ్‌ వేవ్‌ అక్టోబర్‌లో వస్తుందని, అయితే సెకండ్‌ వేవ్‌ కంటే సమర్థంగా మన దేశం ఎదుర్కొంటుందని...
19-06-2021
Jun 19, 2021, 04:27 IST
కర్ఫ్యూ వేళలు సడలింపు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. కర్ఫ్యూ సడలింపు ప్రస్తుతం ఉదయం...
19-06-2021
Jun 19, 2021, 04:06 IST
సాక్షి, ముంబై: దేశంలో కరోనా రెండో వేవ్‌ మొదలైన మహారాష్ట్రలోనే మూడో వేవ్‌ కూడా మొదలుకావొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర...
19-06-2021
Jun 19, 2021, 04:04 IST
రాత్రి, పగలు తేడా లేకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ నిరంతరం పహారా కాస్తుంటుందని, ఎలాంటి చొరబాటు(వ్యాధి)పైనైనా వెంటనే స్పందిస్తుందని...
18-06-2021
Jun 18, 2021, 21:14 IST
సాక్షి, న్యూ ఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజ సంస్ధ పేటీయం తన యూజర్లకు తీపి కబురు...
18-06-2021
Jun 18, 2021, 13:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఇపుడిపుడే కరోనా సెకండ్‌వేవ్‌నుంచి కోలుకుంటున్న దేశ ప్రజలను థర్డ్‌వేవ్‌  పొంచి ఉందన్న అంచనాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ...
18-06-2021
Jun 18, 2021, 11:41 IST
సాక్షి, తాడేపల్లి: కోవిడ్‌ నివారణ చర్యలపై  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టారు. 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్...
18-06-2021
Jun 18, 2021, 11:04 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఇకపై ఏకీకృత పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అందజేసే...
18-06-2021
Jun 18, 2021, 10:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో 73 రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌ కేసులు 8...
18-06-2021
Jun 18, 2021, 09:19 IST
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు వందల సంఖ్యలో నమోదువుతున్నా...
18-06-2021
Jun 18, 2021, 08:55 IST
ఆయన నటించి నిర్మించి దర్శకత్వం వహించిన మారి తొరట్టి చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకుంది. ఆయన నెల క్రితం
18-06-2021
Jun 18, 2021, 06:58 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ రెండో వేవ్‌లో ప్రయాణికుల రద్దీ లేక నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. గత ఏడాది...
18-06-2021
Jun 18, 2021, 01:18 IST
కరోనా మూడో వేవ్‌లో పిల్లలకు ప్రమాదమనే అంచనాల నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో, ఎయిమ్స్‌ సంయుక్తంగా ఐదు రాష్ట్రాల్లోని 10 వేల మందిపై అధ్యయనం చేపట్టాయి.    మన శరీరంలో...
17-06-2021
Jun 17, 2021, 15:35 IST
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గినా దక్షిణాది రాష్ట్రాలు ఇంకా గండం నుంచి గట్టెక్కలేదు. దేశంలో...
17-06-2021
Jun 17, 2021, 15:31 IST
సాక్షి, న్యూఢిల్లీ:   కరోనా  మహమ్మారి చికిత్సలో డీఆర్‌డీవో రూపొందించిన  కీలక డ్రగ్‌ను ఇటీవల విడుదల చేసిన దేశీయ ఫార్మా...
17-06-2021
Jun 17, 2021, 13:05 IST
స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్‌కు చెందిన బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ వ్యాక్సిన్‌కు సంబంధించి మరో ఊరట లభించనుంది.
17-06-2021
Jun 17, 2021, 10:38 IST
డెల్టా వేరియెంట్‌ వెలుగులోకి వచ్చాక భారత్‌ నుంచి ప్రయాణాలపై యూకే నిషేధం విధించి రెడ్‌ లిస్టులో ఉంచడంతో వీసా గడువు...
17-06-2021
Jun 17, 2021, 09:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే నిన్నటితో పోల్చితే..  దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top