Corona Virus: వ్యాప్తి తగ్గుతోంది... రికవరీ బాగుంది.. 

Coronavirus Decreasing Due To The Lockdown In Telangana - Sakshi

రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

పక్షం రోజుల క్రితం 10% వరకు పాజిటివిటీ

ప్రస్తుత నిర్ధారణ పరీక్షల్లో 5-6% మందికే వైరస్‌

మరోవైపు వేగంగా పెరుగుతున్న రికవరీ రేటు

పాజిటివిటీతో పోలిస్తే రికవరీ ఒకటిన్నర రెట్లు అధికం\

రాష్ట్రంలో రికవరీ రేటు 91.33%.. జాతీయ సగటు కంటే 4.1% ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి గణ నీయంగా తగ్గుతోంది. పక్షం రోజుల క్రితం వరకు నిర్ధారణ పరీక్షల్లో దాదాపు పదిశాతం వరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం వ్యాప్తి తీవ్రత సగానికి తగ్గింది. ప్రస్తుతం చేస్తున్న నిర్ధారణ పరీక్షల్లో 5 శాతం నుంచి 6 శాతం మధ్య పాజిటివిటీ కనిపిస్తోంది. అదేవిధంగా రికవరీ రేటు వేగంగా పెరుగుతోంది. రెండువారాల క్రితం రికవరీ రేటు 84.81 శాతం ఉండగా..ప్రస్తుతం 91.33 శాతానికి పెరిగింది. జాతీయ సగటు (87.2%)తో పోలిస్తే రాష్ట్రంలో రికవరీ రేటు 4.1 శాతం అధికంగా ఉన్నట్లు రా ష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.  

లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. 
గతనెలాఖరు నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించినప్పటికీ కేసుల తీవ్రత తగ్గకపోవడంతో, ఆ తర్వాత ప్రతిరోజూ ఉదయం 10గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కేవలం 4 గంటల సడలింపుతో ప్రభుత్వం లాక్‌డౌన్‌అమలు చేస్తోంది. దీంతో ప్రయాణాలు, ప్రజల రాకపోకలు, ఎక్కువ సంఖ్యలో గుమికూడేందుకు వివాహాలు..ఇతర శుభాకార్యాలు గణనీయంగా తగ్గి వైరస్‌ వ్యాప్తి కట్టడిలోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈనెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఉదయం పూట సడలింపులున్న సమయంలో రోడ్లపై రద్దీ విపరీతంగా ఉండడం వైరస్‌ వ్యాప్తికి దోహదపడుతోందని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొనడంతో పోలీసు శాఖ ఇటీవల మరింత కఠినతరం చేసింది. ఇది కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. 

పాజిటివ్‌ 66,087 .. రికవరీ 94,993 
ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల కంటే రికవరీ అవుతున్నవారి సంఖ్యే ఎక్కువ. గత 2 వారాలుగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 66,087 మంది కోవిడ్‌–19 బారిన పడ్డారు. ఇదే సమయంలో 94,993 మంది రికవరీ అయ్యారు. దీనిని బట్టి పాజిటివిటీ కంటే రికవరీ రేటు దాదాపు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-05-2021
May 23, 2021, 05:34 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ప్రకోపం కాస్తంత తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నెల పదో తేదీన 24.83 శాతంగా...
23-05-2021
May 23, 2021, 05:25 IST
ఇండియానాపొలిస్‌(అమెరికా): దేశం మొత్తమ్మీద కోవిడ్‌–19 నిరోధక టీకాలు తీసుకున్న వారి సంఖ్య 20 కోట్లకు చేరువ అవుతోంది. తొలి డోసు...
23-05-2021
May 23, 2021, 05:03 IST
పెదబయలు: కోవిడ్‌పై గ్రామాల్లో అవగాహన పెరుగుతోంది. లేనిపోని భయాలు తగ్గి..తగు జాగ్రత్తలతో మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి బాంధవ్యాలను,...
23-05-2021
May 23, 2021, 04:42 IST
దుగ్గిరాలపాడు (జి.కొండూరు): చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠంలా.. 2017లో డెంగీ జ్వరాలతో అల్లాడిపోయిన దుగ్గిరాలపాడు గ్రామ ప్రజలు నేడు...
23-05-2021
May 23, 2021, 03:51 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాక్సిన్‌ను అందరికీ ఉచితంగా వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోయినప్పటికీ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌...
23-05-2021
May 23, 2021, 03:17 IST
ముంబై సెంట్రల్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా మహమ్మారి విశ్వరూపం ఇంకా కొనసాగుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను...
23-05-2021
May 23, 2021, 03:01 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణకు ప్రస్తుతం వ్యాక్సినేషనే శరణ్యమని, ఇలాంటి పరిస్థితిలో ప్రైవేట్‌ ఆస్పత్రుల వారు నేరుగా వ్యాక్సిన్‌ కోనుగోలు...
23-05-2021
May 23, 2021, 02:22 IST
సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌: శనివారం ఉదయం 10.30 గంటలు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లోకి వచ్చీపోయే దారులన్నీ మూతపడ్డాయి.. ప్రధాన రహదారులన్నిటా చెక్‌పోస్టులు...
23-05-2021
May 23, 2021, 02:20 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా ఏడాదిగా మనిషికి ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది. వ్యాధి లక్షణాలు మొదలుకొని వైరస్‌ వ్యాప్తి వరకూ ఎప్పటికప్పుడు...
23-05-2021
May 23, 2021, 02:08 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ పంజా విసురుతోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం వికారాబాద్‌ జిల్లాకు...
23-05-2021
May 23, 2021, 01:43 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా సెకండ్‌ వేవ్‌ నియంత్రణ అంటే.. మొదటగా టెస్టుల్లో పాజిటి విటీ రేట్‌ తగ్గుతుంది. ఆ తర్వాత...
23-05-2021
May 23, 2021, 01:42 IST
జార్ఖండ్‌ నుంచి ఒక రైలు బయలుదేరింది. అయితే అది మామూలు రైలు కాదు. ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’. దాదాపు 2000 కిలోమీటర్ల...
23-05-2021
May 23, 2021, 01:29 IST
న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు కొంత తగ్గుముఖం పడుతూ రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ.. ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర...
23-05-2021
May 23, 2021, 01:27 IST
కార్మిక సంఘాల పోరుబాటలో జీవిత చరమాంకం వరకు పిడికిలి బిగించి ముందు వరుసలో నడిచిన జ్యోత్స ్న బసు.. కరోనా...
22-05-2021
May 22, 2021, 21:46 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించనివారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో లాక్‌డౌన్‌ను...
22-05-2021
May 22, 2021, 20:54 IST
బీజింగ్‌: కోవిడ్‌ వ్యాప్తి మొదలైనప్పుడు మాజీ అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనాను చైనీస్‌ వైరస్‌ అని ఆరోపించిన సంగతి తెలిసిందే....
22-05-2021
May 22, 2021, 17:57 IST
హైదరాబాద్‌: కరోనా నిబంధనలు పాటిస్తూ.. స్వీయ రక్షణకు సమష్టి నిర్ణయాలు తీసుకొని ఆచరిస్తూ కంటికి కనిపించని వైరస్‌ అనే శత్రువుతో...
22-05-2021
May 22, 2021, 17:11 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా బాధితులకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్ష బ్లాక్‌మార్కెట్‌ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా రెమ్‌డెసివర్‌ను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న వ్యక్తిని...
22-05-2021
May 22, 2021, 16:42 IST
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రి వద్ద శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు మారుస్తుండగా...
22-05-2021
May 22, 2021, 15:41 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రపంచాన్ని వణికిస్తోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top