తెలంగాణలో 1891 కరోనా కేసులు | Coronavirus: 1891 New Positive Cases Registered In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1891 కరోనా కేసులు

Aug 2 2020 9:47 AM | Updated on Aug 2 2020 10:49 AM

Coronavirus: 1891 New Positive Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తాగాజా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1891 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,677కి చేరింది. ఒక్కరోజులో 1088 మంది కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 47,590గా ఉంది. గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనాతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 540కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18, 547 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధితో 517  కరోనా పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి. (చదవండి: విచారణకు కమిటీ)

జిల్లాల వారిగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య:

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement