బండ్ల గణేష్‌ సంచలన నిర్ణయం.. ఇక రాజకీయాలకు గుడ్‌ బై

Congress Leader Bandla Ganesh Says Goodbye To Politics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్‌ బై చెబుతున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. 

కాగా, బండ్ల గణేష్‌ ట్విట్టర్‌ వేదికగా.. ‘నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, 2018లో బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top