హైదరాబాద్: మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ప్రత్యేకంగా 553 బస్సులను ప్రారంభించారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ఆడబిడ్డలను లక్ష్మీ దేవితో కొలిచే సంస్కృతి మనది.
భూమిని భూమాతగా, దేశాన్ని భారత మాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తాం. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం మన కీర్తిని ప్రపంచానికి చాటారు. ఆడబిడ్డలకు ఓటు హక్కును కల్పించి వారి చేతికి అధికారం ఇచ్చిన ఘనత నెహ్రూది. రాష్ట్రపతిగా, మంత్రులుగా ఆడబిడ్డలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో 33 శాతం మహిళలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారు
మహిళా స్వయం సహాయక సభ్యుల సంఖ్య కోటి మందికి చేరాలి. ఈ వేదికగా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది. వెయ్యి కాదు… 3 వేల బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేస్తాం’ అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంచితే, కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభకు బస్సులో రాగా అదే సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది.
CM Revanth Reddy flagged off 553 buses operated by Mandal Mahila Samakhyas (MMS)
మండల మహిళా సమాఖ్యల(MMS) ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను పరేడ్ గ్రౌండ్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్,… pic.twitter.com/IPhuWbxu9X— Congress for Telangana (@Congress4TS) June 9, 2026


