క్లీన్‌.. ట్రాఫిక్‌ ఫ్రీ | CM Revanth Reddy Issues Key Directives to Municipal Officials | Sakshi
Sakshi News home page

క్లీన్‌.. ట్రాఫిక్‌ ఫ్రీ

Nov 3 2026 4:56 AM | Updated on Nov 3 2026 4:57 AM

CM Revanth Reddy Issues Key Directives to Municipal Officials

హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి సమగ్ర కార్యాచరణ

మున్సిపల్‌ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

ఇంటింటి నుంచి ప్రతిరోజూ చెత్త సేకరణ.. నిరంతర పర్యవేక్షణ

చెత్త సేకరణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

సిగ్నల్‌ ఫ్రీ వ్యవస్థకు అండర్‌ పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మహా నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్‌ సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్‌ అధికారులతో నగర అభివృద్ధి, పారిశుధ్యం, చెత్త నిర్వహణ, గ్రీన్‌ వాటర్‌ వినియోగం, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు తీసు కోవాలన్నారు.

ఇంటింటి నుంచి ప్రతిరోజూ చెత్త సేక రణ జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయా లని, ఈ ప్రక్రియపై నిరంతరం పర్య వేక్షణ ఉండాలని ఆదేశించారు. విధుల్లో నిర్ల క్ష్యం వహించే సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకో వాలని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా వాటిని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మున్సిపల్‌ పరిధిలోని వివిధ పారి శ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణకు ‘ఐలా’ అధికారులతో సమన్వయం చేసుకోవా లని సూచించారు. అలాగే, నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్, ఇతర అవసరా లకు తాగునీటిని వినియోగిస్తున్న పరిస్థితిని మార్చాలని సీఎం సూచించారు.

మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన నీటిని ఈ అవసరాలకు వినియోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయవచ్చ న్నారు. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ‘గ్రీన్‌ వాటర్‌ ట్యాంకర్ల’ను సద్వినియోగం చేసుకునేలా ప్రజలు, సంబంధిత సంస్థలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారు లను ఆదేశించారు. జలమండలి తొలివిడతగా 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి 28 గ్రీన్‌ వాటర్‌ ట్యాంకర్ల ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోనూ గ్రీన్‌ వాటర్‌ సరఫరాను మరింత విస్తరించాలని సూచించారు. నిర్మాణ రంగం, గ్రీనరీ నిర్వహణ, పార్కుల అభివృద్ధి తదితర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

సిగ్నల్‌ ఫ్రీ రాకపోకలకు ప్రణాళికలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టి నగరాన్ని ట్రాఫిక్‌ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా రాకపోకలు నిరంతరాయంగా సాగేలా చర్యలు చేపట్టాలన్నారు. సిగ్నల్‌ ఫ్రీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని, అక్కడ అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

నగరంలోని ప్రధాన రహదారులు, కీలక కూడళ్లలో ట్రాఫిక్‌ రద్దీకి కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌ రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement