కొత్త సచివాలయ పనులు సీఎం కేసీఆర్‌ పరిశీలన | CM KCR Visits watched New Secretariat | Sakshi
Sakshi News home page

కొత్త సచివాలయ పనులు సీఎం కేసీఆర్‌ పరిశీలన

Jan 26 2021 1:54 PM | Updated on Jan 26 2021 2:13 PM

CM KCR Visits watched New Secretariat  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యాధునికంగా.. సకల సౌకర్యాలతో కొత్త స‌చివాల‌య నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ప‌నుల‌ను షాపూర్‌ పల్లోంజీ చేపడుతోంది. రూ.617 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఈ పనులను మంగళవారం సీఎం కేసీఆర్‌ ఆకస్మికంగా పరిశీలించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్‌ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.

రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారులు, ఇంజినీర్లతో సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను అక్క‌డున్న సిబ్బందిని అడిగి కొన్ని సూచనలు చేశారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement