తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ

CM KCR Logo unveiling of Telangana Decade Festival - Sakshi

సచివాలయంలో ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో పదేళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆవిష్కరించారు. సెక్రటేరియట్‌ లోని తన చాంబర్‌లో సోమవారం మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులతో కలిసి ఈ లోగోను కేసీఆర్‌ ఆవిష్కరించారు.

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ఈ లోగోలో పొందుపరిచారు. కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులు, యాదాద్రి వంటి ఆధ్యా త్మిక పుణ్యక్షేత్రాలు, విద్యుత్‌ వ్యవసాయం, మిషన్‌ భగీరథ,  మెట్రో రైలు, టీ–హబ్, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం చిహ్నాలను సీఎం ఆదేశాల మేరకు లోగోలో చోటు కల్పించారు. వీటితో పాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ, , బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా లోగోలో చోటిచ్చారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, దేశ పతి శ్రీనివాస్, పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, బాల్క సుమన్, సీఎస్‌ శాంతి కుమారి, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్‌ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top