యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్ టెర్మినల్

Bus Terminal Will Be Constructed  In Yadadri Temple Says minister  - Sakshi

150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపో నిర్మాణం

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్ల‌డి

యాదాద్రి, భువనగిరి :  దేశ, విదేశాల నుంచి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది  భ‌క్తుల ర‌ద్ధీకి అనుగుణంగా ఆలయ సమీపంలో 7 ఎకరాల్లో ఆధ్యాత్మిక బస్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు  రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయంలో నిర్మించే బస్ టెర్మినల్,  బస్ డిపోకు కావల్సిన స్థలాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్  సునీల్ శర్మతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సైదాపురం గ్రామ శివారులో 150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపో నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.  ముఖ్యమంత్రి ఆమోదంతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలను చేపడతామన్నారు. 

ఆలయ ప్రారంభానికి ముందే బస్ టెర్మినల్, డిపోలను ప్రారంభించడానికి అన్ని పనులను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారులకు ఆదేశించారు.ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేకమైన స్టేషన్, ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు మరో స్టేషన్ నిర్మాణం నూతన బస్ టెర్మినల్ లో నిర్మించేలా ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారుఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ సుశీల్ శర్మ, కలెక్టర్ అనితా రామచంద్రన్, ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ ఎం.ఆర్‌.ఎం. రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లు శ్రీ పురుషోత్తం, శ్రీ పి.వి.మునిశేఖ‌ర్‌, న‌ల్గొండ ఆర్‌.ఎం శ్రీ వెంక‌న్న‌, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈ ఓ గీత, ఆర్ అండ్ బీ అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top