అనాథ మహిళ మృతి.. రెండు గ్రామాల మధ్య ‘ఖనన’ పంచాయితీ

Burial Place Issue In Two Villages In Wanaparthy - Sakshi

సాక్షి, అమరచింత(మహబూబ్‌నగర్‌): ఓ అనాథ మహిళ మృతి చెందగా ఇరు గ్రామాల మధ్య ‘ఖనన’ పంచాయితీ తలెత్తింది. చివరకు ఒకరిద్దరు గ్రామ పెద్దల జోక్యంతో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని కిష్టంపల్లికి శ్మశాన వాటిక లేదు. దీంతో పక్క గ్రామమైన నందిమల్ల ఎక్స్‌రోడ్డు శివారులో ఇటీవల అధికారులు రెండెకరాలు కేటాయించారు.

అయితే కిష్టంపల్లిలో ఎవరు చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు నందిమల్ల ఎక్స్‌రోడ్డు మధ్య నుంచే వెళ్లాలి. దీంతో ఇరు గ్రామాల మధ్య పంచాయితీ న డుస్తోంది. కాగా, కిష్టంపల్లికి చెందిన అనాథ దాసరి కొండమ్మ (80) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. సర్పంచ్‌ చెన్నమ్మతో పాటు గ్రామస్తులు ఆర్థికసాయం అందించి మధ్యాహ్నం అంతిమ సంస్కారాలకు సిద్ధమయ్యారు. ఖననానికి తీసుకెళ్తుండగా తమ గ్రామం మీదుగా వద్దని నందిమల్ల ఎక్స్‌రోడ్డు గ్రామస్తులు అడ్డుకున్నారు.

మృతదేహాన్ని అక్కడే ట్రాక్టర్‌పై నుంచి కిందికి దింపారు. ఇరు గ్రామస్తుల మధ్య గంటన్నర పాటు వాదోపవాదా లు నడిచాయి. కొందరు నాయకులు జోక్యం చేసుకు ని మృతదేహాలు తీసుకెళ్లడానికి వేరే మార్గం చూపి స్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. చివరకు అనాథ మహిళ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

చదవండి:   రిమ్స్‌లో దారుణం: కాలం చెల్లిన ఇంజక్షన్‌లతో చికిత్స..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top