
కరీంనగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన బీసీ కదనభేరి సభను వాయిదా వేస్తున్నట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
ఈనెల 14, 15, 16, 17 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశము న్నట్లు వాతావరణశాఖ సూచనల మేరకు 14న నిర్వహించే బీసీ కదనభేరిని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. వాతా వరణం అనుకూలించిన తదుపరి తేదీని నిర్ణయిస్తామని, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు గమనించాలన్నారు.