BRS MLAs Poaching Case: CBI waits for Supreme Court orders - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల ఎర కేసు.. కీలకంగా సుప్రీం విచారణ!

Feb 16 2023 3:57 PM | Updated on Feb 16 2023 4:27 PM

BRS MLAs Poaching Case: CBI Waits For SC Orders - Sakshi

తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ.. 

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నతన్యాయస్థానం దర్యాప్తు చేపట్టమని ఆదేశించింది. దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగేందుకు రెడీ కూడా అయ్యింది. కానీ,  తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందనా, సహకరం రెండూ లేవు. పైగా కోర్టును ఆశ్రయించుకుంటూ పోతోంది.  ఈ తరుణంలో.. సుప్రీం కోర్టు విచారణపైనే సీబీఐ దర్యాప్తు ఆధారపడనుంది.

ఎమ్మెల్యేల ఎర కేసులో రేపు(శుక్రవారం) సుప్రీం కోర్టు విచారణ కీలకం కానుంది. సుప్రీం విచారణ తర్వాత కేసు నమోదుపై సీబీఐ ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ కనిపిస్తోంది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే..

కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఐదుసార్లు లేఖ కూడా రాసింది దర్యాప్తు సంస్థ. అయినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీం విచారణ, ఆదేశాలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement