
మామతో సంబంధాన్ని గుర్తించిందని బిడ్డను హత్య చేసిన తల్లి
2022 నాటి కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు
ఖమ్మం: వావివరుసలు మరిచి భర్త తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. తమ వ్యవహారాన్ని కుమార్తె గమనించిందని హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో మృతి చెందినట్లు చిత్రీకరించినా భర్త అనుమానంతో విషయం బయటపడింది. ఈ కేసులో నిందితులిద్దరికీ జీవితఖైదు విధిస్తూ సత్తుపల్లి ఆరో అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీని వాస్ సోమవారం తీర్పు వెలువరించారు. బోనకల్ కు చెందిన పాలెపు సునీత తన మామ(భర్త తండ్రి) నర్సింహారావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ట్రాలీ డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త హరికృష్ణ 2022 ఫిబ్రవరి 9న బయటకు వెళ్లగా ఆయన భార్య సునీత, తండ్రి నర్సింహారావు కలిశారు. ఈ విషయాన్ని అప్పుడు 11ఏళ్ల సునీత పెద్దకుమార్తె చూడడంతో ఆమె మెడకు వైరు బిగించి హతమార్చారు. ఆపై భర్త హరికృష్ణకు ఫోన్ చేసి కుమార్తె ఆరోగ్యం బాగా లేదని చెబుతూ 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రు వీకరించారు.
అయితే, హరికృష్ణ కూతురు మెడపై కమిలినట్లు ఉండడంతో బోనకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమాన దర్యాప్తు చేపట్టిన పోలీ సులు సునీత, నర్సింహారావును విచారించగా అసలు విషయం బయటపడడంతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో వీరిద్దరిపై నేరం రుజువు కాగా జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు ప్రాసిక్యూటర్ అబ్దుల్‌బాషా వాదించగా, కేసు విచారణలో కీలకంగా వ్యహరించిన సీఐ మురళి, ఎస్సై కవిత, సిబ్బంది బి.అరవింద్, శ్రీకాంత్‌ను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అభినందించారు.