రైల్వేలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి  | Boinapally Vinod Kumar Demand To Release Vacant Posts In Railway Department | Sakshi
Sakshi News home page

రైల్వేలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి 

Dec 13 2022 1:06 AM | Updated on Dec 13 2022 1:06 AM

Boinapally Vinod Kumar Demand To Release Vacant Posts In Railway Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే శాఖలో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న 3,15,823 ఉద్యోగాల­ను వెంటనే భర్తీ చేయా­లని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రైల్వేశాఖలో ఉన్న ఖాళీ ఉద్యోగాల జాబితాను రాజ్యసభలో కేంద్ర రైల్వేమంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ విడుదల చేశారని, ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే 17,134 వివిధ కేటగిరీల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు.

రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు ఖాళీగా ఉన్న రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని  ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాలు పొందే విధంగా బీజేపీ ఎంపీలు కృషి చేయాలని సూచించారు. కేంద్రం వెంటనే రైల్వే శాఖతో పాటు ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకోవాలని వినోద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement