
ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో గుర్తింపు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఎనిమిదేళ్ల క్రితం చోరీకి గురైన ఓ బైక్ పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్ సాగర్ రింగ్‌రోడ్డులోని సద్గురునగర్ కాలనీకి చెందిన పర్రపాటి మహేష్ కుమార్ 2017 సెపె్టంబర్ 7న రాత్రి ఇబ్రహీంపట్నం వందనా విహార్ రెస్టారెంట్‌కు వెళ్లి తన బైక్‌ను హోటల్ ముందు పార్కు చేశాడు. ఉదయం పార్కింగ్ స్థలంలో బైక్ కనిపించకపోవడంతో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం బంజారాహిల్స్ ట్రాఫిక్ క్రేన్ ఎస్‌ఐ సుమన్‌రెడ్డి సిబ్బందితో కలిసి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లో రోడ్ల పక్కన అక్రమ పార్కింగ్ చేసిన ఓ బైక్‌ను సీజ్ చేసి చలానా విధించి క్రేన్‌లోకి ఎక్కించాడు. కొద్దిసేపట్లోనే అక్కడికి వచి్చన అబూ అల్తామస్ అనే వ్యక్తి బైక్ తనదేనని చెప్పి జరిమానా చెల్లించాడు.
బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుండగా బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్‌కు టాస్‌్కఫోర్స్ పోలీసులు ఫోన్ చేశారు. ఇంతకు ముందు మీరు సీజ్ చేసిన బైక్ చోరీ చేసినదని, వెంటనే ఆపాలని చెప్పారు. దీంతో సదరు వ్యక్తిని ఆపారు. అప్పటికే బైక్ యజమానికి చలానా విధించిన మెసేజ్ వెళ్లింది. ఈ బైక్ తనదేనని, చోరీకి గురైందని, సంబంధిత పత్రాలను అటు ఇబ్రహీంపట్నం పోలీసులు, అటు వాహన యజమాని పోలీసులకు పంపాడు. దీంతో సదరు బైక్‌తో పాటు అబూ అల్తామస్‌ను కూడా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.