యాచన.. డిజిటల్‌ యోచన

Beggars Using Scanner Phonepe And Google Pay In Suryapet District - Sakshi

అర్వపల్లి: అంతా డిజిటల్‌మయం కావడంతో యాచకులు కూడా స్కానర్లు, ఫోన్‌పే, గూగుల్‌పేలను వినియోగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో శనివారం ఓ టీస్టాల్‌లో యాచకుడు యాచించగా యజమాని గోవర్ధన్‌ నగదు లేదన్నాడు. వెంటనే యాచకుడు తన వద్ద ఉన్న డిజిటల్‌ పేమెంట్‌ స్కానర్‌ను చూపించాడు. దీంతో గోవర్దన్‌ తన సెల్‌తో స్కాన్‌ చేసి డిజిటల్‌ పేమెంట్‌ విధానంలో చెల్లించాడు.

ఈ సందర్భంగా యాచకుడు చిన్నమారన్న మాట్లాడుతూ.. అంతా డిజిటల్‌ కాలం కావడంతో యాచకులం కూడా మారాల్సి వచ్చిందని చెప్పాడు. తనది ఏపీలోని నంద్యాల జిల్లా గుండాల (ఎస్‌) గ్రామమని తెలిపాడు. హనుమాన్‌ వేషధారణలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు తిరుగుతూ యాచిస్తున్నట్లు చెప్పాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top