Basara IIIT Students Protest Latest Update: Revanth Reddy Arrested, Details Inside - Sakshi
Sakshi News home page

Basara IIIT Protests: పోలీసుల కళ్లు గప్పి బాసర ట్రిపుల్‌ ఐటీలోకి రేవంత్‌ రెడ్డి.. అరెస్ట్‌

Jun 17 2022 5:24 PM | Updated on Jun 17 2022 5:55 PM

Basara IIIT Students Protest: Revanth Reddy Arrested - Sakshi

పోలీసుల కళ్లు గప్పి గోడ దూకి బాసర ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లోకి వెళ్లారు టీపీసీసీ చీఫ్‌..

సాక్షి, నిర్మల్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని బాసర పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో.. శుక్రవారం బాసరకు చేరుకున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోలీసుల వలయాన్ని ఛేదించి రహస్యంగా గోడ దూకి లోపలికి ప్రవేశించారు. 

ఆపై ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. అక్రమ అరెస్టుపై ఆయన మండిపడ్డారు. విద్యార్థుల  సమస్యలను వెంటనే  పరిష్కరించాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement