సమస్యలు పరిష్కరించండి

Bar Owners Association Request To Minister Srinivas Goud - Sakshi

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బార్‌ యజమానుల సంఘం వినతి   

శ్రీనగర్‌కాలనీ (హైదరాబాద్‌): పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రెస్టారెంట్స్‌ అండ్‌ బార్‌ లైసెన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.దామోదర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.జైపాల్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు విజయ్‌కు మార్‌గౌడ్‌లు ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం సంఘం నాయకులు మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి అసోసియేషన్‌ సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు.

బార్‌ లైసెన్స్‌ 2బీ ఫీజును నాలుగు వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని, ఎంఆర్‌పీ రౌడింగ్‌ఆఫ్‌ను వైన్స్‌ మాదిరిగా మద్యం కోటాలో కలపకుండా స్టాక్‌ ఇవ్వాలని కోరారు. జాతీయ రహదారులపై అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న డాబాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, బెల్ట్‌షాప్‌లను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కూడా వినతి పత్రాన్ని అందజేశామని సంఘం నాయకులు తెలిపారు. మంత్రిని కలసినవారిలో అసోసియేషన్‌ గౌరవ సలహాదారు బాలరాజ్‌గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, రాజుగౌడ్, శ్రీనివాసగుప్తా తదితరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top