ఖైరతాబాద్‌లో మొసలి పిల్ల కలకలం

Baby Crocodile In Chintal basti Nala Khairatabad - Sakshi

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బుధవారం భారీగా కురిసిన వానకు నాలాలన్నీ పొంగిపొర్లాయి. ఇదే క్రమంలో చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల ఒకటి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. 

చింతల్ బస్తీలో నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర నాలా వద్ద మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. వెంటనే భయభ్రాంతులకు గురైన స్థానికులు మొసలిని కర్రలతో బెదిరించే ప్రయత్నం చేశారు. మొసలి పిల్ల అరవడం మొదలుపెట్టడంతో అక్కడివారంతా తలోదిక్కూ పరుగులు తీశారు.

అక్కడివారు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి సమాచారమందించారు. భారీగా కురిసిన వర్షానికి రోడ్డు మీదకు వచ్చిన డ్రైనేజీ నీటి ఉధృతికి మొసలి రోడ్డుపైకి కొట్టుకుని వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: గణేష్‌ నిమజ్జనం.. మెట్రో సేవల సమయం పొడిగింపు..  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top