శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా యత్నాలు: తలసాని

Attempts To Disrupt Peace And Security: Talasani Srinivas Yadav - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కొంతమంది కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆరోపించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చిన్న వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోషించే వారుంటారని, వారు ఇబ్బంది పడుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఎం కేసీఆర్‌ పాలన అందించారని గుర్తు చేశారు. కావాలనే కొంతమంది కుట్రలకు దారితీశారనే విషయాన్ని మేధావులు గమనించాలని విన్నవించారు.    

పాఠశాల నుంచే దేశభక్తిని పెంపొందించాలి
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందింపజేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామన్నారు. గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి సహకరించిన తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, డిజిటల్‌ సర్వీస్‌ ప్రతినిధులను తలసాని సన్మానించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top