
సాక్షి, హైదరాబాద్: థామస్ రెడ్డి వెంట ఉన్న వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులేనని టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వద్ధామరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పదవి కాంక్షతోనే థామస్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ రాజీనామా చేస్తామని చెప్పిన వారంతా డిపోల్లో పని చేసే వ్యక్తులేనని, ఒక్కరు కూడా టీఎంయూలో ఉన్న నేతలు లేరన్నారు. తనకు ఇవాళ రాజీనామా చేస్తామని చెప్పిన వాళ్లలో ఇప్పుడు ఫోన్ చేసి యూనియన్‌లో కొనసాగుతామని చెప్పారని ఆయన తెలిపారు. తాను రాజకీయ పదవులు ఆశించనని స్పష్టం చేశారు. ఇప్పటికే కార్మిక సంఘ యూనియన్‌లో ఉంటూ రాజకీయాల్లో పోటీ చేయకూడదని ఆయన తెలిపారు.