
ఆగస్టు 31వ తేదీ ఆఖరు
సాక్షి, హైదరాబాద్: రైతు నేస్తం(Rythunestam) పురస్కారాలకు వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నొవేషన్స్, రైతు ల నుంచి రైతు నేస్తం మాసపత్రిక దరఖాస్తులకు ఆహా్వనించింది. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్‌లో రైతునేస్తం 21వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఐ.వి.సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష సేవ లందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతోపాటు అగ్రి ఇన్నొవే షన్స్‌ను అవార్డులతో ఘనంగా సత్కరించనుందని నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.
రైతునేస్తం వెబ్‌సైట్ https://rythunestham.in/awards నుంచి అప్లికేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి ‘ఎడిటర్, రైతునేస్తం, 6–2–959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్–500004, ఫోన్: 9676797777 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం.8–198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్–522 017, ఫోన్: 97053 83666 చిరునామాలకు పంపాలని సూచించారు. లేదంటే editor@rythunestham. in కు ఇ–మెయిల్ చేయవచ్చని, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని తెలిపారు.