Hyderabad: సెక్యూరిటీ గార్డుల దౌర్జన్యం.. నువ్వు ఏ లిఫ్ట్‌లో వెళ్లావ్‌? స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి

Apartment Security Guard Attack On Delivery Boy At Gachibowli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ స్విగ్గీ డెలివరీ బాయ్‌పై సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8.58 గంటల సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ శాంతకుమార్‌ గచ్చిబౌలిలోని ఎన్‌సీసీ నాగార్జున రెసిడెన్సీ గేటెడ్‌ కమ్యూనిటీలో ఫుడ్‌ డెలివరీకి వెళ్లాడు.

తిరిగి వస్తుండగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఆపి నువ్వు ఏ లిఫ్ట్‌లో వెళ్లావని అడగ్గా, స్విగ్గీ బాయ్‌ సర్వీస్‌ లిఫ్ట్‌లో వెళ్లానని చెప్పగా,  లేదు నువ్వు మెయిన్‌ లిఫ్ట్‌లో వెళ్లావంటూ గొడవకు దిగారు. ఆరుగురు సెక్యూరిటీ గార్డులు దాడి చేయగా, గాయపడిన శాంతకుమార్‌ అక్కడి నుంచి తప్పించుకొని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. 
చదవండి: జనవరిలో పెళ్లి.. నెల రోజులుగా గొడవలు.. ఉన్నట్టుండి భర్త మాయం!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top