చిన్నారులకు ఆపన్నహస్తం చైల్డ్‌లైన్‌ –1098 | Apannahastham Childline for Helping Kids 1098 | Sakshi
Sakshi News home page

చిన్నారులకు ఆపన్నహస్తం చైల్డ్‌లైన్‌ –1098

Dec 7 2025 10:45 AM | Updated on Dec 7 2025 12:15 PM

Apannahastham Childline for Helping Kids 1098

కాచిగూడ: ఆపదలో ఉన్న పిల్లలకు ఆపన్నహస్తం అందించేందుకు చైల్డ్‌లైన్‌ 1098ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘చైల్డ్‌లైన్‌ 1098’ సేవలు 24/7 అందుబాటులో ఉన్నాయి. అలాగే రైల్వే స్టేషన్లలో 1098  చైల్డ్‌ హెల్ప్‌ డెస్క్‌లు కూడా ఉన్నాయి. ఈ సెంటర్లకు కాల్‌ చేస్తే అక్కడ ఉండే సిబ్బంది పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడి, వారి మానసిక సమస్యలను తెలుసుకొని ధైర్యం చెబుతారు. ఇబ్బందుల్లో ఉంటే అధికారులు రంగంలోకి దిగి తక్షణమే సాయం చేస్తారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని 1వ నంబర్‌ ఫ్లాట్‌ఫాంపై రైల్వే అధికారులు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.  

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో..     

వీరిలో ఎవరిని చూసినా.. 
తప్పిపోయిన పిల్లలు 
⇒  వైద్య సహాయం అవసరమైనవారు  
⇒  సంరక్షణ, రక్షణ కావాల్సినవారు  
⇒  లైంగిక వేధింపులకు గురైన పిల్లలు 
⇒  వదిలివేతకు గురైనవారు  
⇒  చట్టంతో విబేధించినవారు.

⇒   ఇలా వీరిలో ఎవరినైనా చూస్తే 1098కి ఫోన్‌ చేయాలని పిల్లల సహాయ కేంద్రం కాచిగూడ రైల్వే స్టేషన్‌ సెంటర్‌ సూపర్‌వైజర్‌ చట్ల సురేష్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా 18 ఏళ్లలోపు పిల్లలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించడం కోసం ఈ చైల్డ్‌ లైన్‌ సేవలు అందిస్తోంది. కాచిగూడ పరిసర ప్రాంతాల వారు సెల్‌: 9505113750లో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement