దివాళా తీసిన ప్రముఖ యానిమేషన్‌ కంపెనీ | Animation Company DQ Entertainment Pvt Limited Announces Bankruptcy | Sakshi
Sakshi News home page

దివాళా తీసిన ప్రముఖ యానిమేషన్‌ కంపెనీ

Nov 6 2020 1:50 PM | Updated on Nov 6 2020 1:50 PM

Animation Company DQ Entertainment Pvt  Limited Announces Bankruptcy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ప్రముఖ యానిమేషన్‌ కంపెనీ డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ తన కార్యాలయాన్ని మూసివేసింది.  దివాలా తీసినట్లు కోర్టులో ఆ కంపెనీ పిటిషన్‌ దాఖలు చేసింది.  దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న 1400 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.  గత ఎనిమిది నెలల నుంచి  ఈ సంస్థ తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.  సంస్థపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.  ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.14లక్షల వరకు  రావాలని ఉద్యోగులు తెలిపారు. తమ వేతనాలు అడిగితే వేధింపులకు , బెదిరింపులకు పాలుపడుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. 

చదవండి: లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి

Advertisement
 
Advertisement
Advertisement