లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి | Sakshi
Sakshi News home page

30 నిమిషాల పాటు లిఫ్టులోనే.. 

Published Fri, Nov 6 2020 12:35 PM

Minister Koppula Eshwar Stucks In Lift In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రి కొప్పుల ఈశ్వర్‌ లిఫ్టులో ఇరుక్కుపోయారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించిన అనంతరం 30 నిమిషాల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. శుక్రవారం సైఫాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ అక్కడి లిఫ్ట్‌లోకి ఎక్కారు. అయితే ఆ లిఫ్ట్‌ మధ్యలోనే ఆగిపోయింది. అందులోనుంచి మంత్రిని బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు 30 నిమిషాలు కష్టం అనంతరం లిఫ్ట్‌ లాక్‌ ఓపెన్‌ అయింది. దీంతో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.

చదవండి :  తెలంగాణాలో అమెజాన్‌ భారీ పెట్టుబడులు  

Advertisement
 
Advertisement