ఏఎండీఈఆర్, హైదరాబాద్‌లో 12 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

AMDER Hyderabad, NIEPID Secunderabad Recruitment 2021: Vacancies, Eligibility - Sakshi

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఏఎండీఈఆర్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

►  మొత్తం పోస్టుల సంఖ్య: 12
► పోస్టుల వివరాలు: ల్యాబొరేటరీ అసిస్టెంట్‌–03, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–09.

► ల్యాబొరేటరీ అసిస్టెంట్‌: అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 06.08.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.20,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

► ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: విభాగాలు: జియాలజీ, జియోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌.

అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 06.08.2021 నాటికి 27ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్‌ పర్సనల్‌ ఆఫీసర్‌(ఆర్‌) అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఏఎండీ), 1–10–153–156, ఏఎండీ కాంప్లెక్స్, బేగంపేట్, హైదరాబాద్‌–500016, తెలంగాణ చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 06.08.2021

► వెబ్‌సైట్‌: https://www.amd.gov.in/app16/index.aspx


ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో 20 ఖాళీలు

సికింద్రాబాద్‌లోని మనోవికాస్‌ నగర్‌లో భారత ప్రభుత్వ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీస్‌(ఎన్‌ఐఈపీఐడీ).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

►  మొత్తం పోస్టుల సంఖ్య: 20

► పోస్టుల వివరాలు: ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌(రెగ్యులర్‌)–04, ఎంఎస్‌ఈసీ, నోయిడా (రెగ్యులర్‌)–01, సీఆర్‌సీ, దావెనగర్‌(రెగ్యులర్‌)–02, సీఆర్‌సీ, నెల్లూరు(ఏపీ)–09, సీఆర్‌సీ, రాజ్‌నందగావ్‌(ఛత్తీస్‌గఢ్‌)–04. (ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్‌ బంపర్‌ ఆఫర్‌..!)

► ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌ (రెగ్యులర్‌): పోస్టులు: లెక్చరర్‌(రిహేబిలిటేషన్‌ సైకాలజీ, ఒకేషనల్‌ కౌన్సెలింగ్‌ అండ్‌ ఎంప్లాయ్‌మెంట్‌), జూనియర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్, స్టెనోగ్రాఫర్‌.

► ఎంఎస్‌ఈసీ, నోయిడా(రెగ్యులర్‌): ప్రిన్సిపల్‌.

► సీఆర్‌సీ, దావెనగర్‌(రెగ్యులర్‌): పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(మెడికల్‌ పీఎంఆర్‌), ఓరియంటేషన్‌ అండ్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్‌.

► సీఆర్‌సీ, నెల్లూరు(ఏపీ): పోస్టులు: డైరెక్టర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ప్రొస్థెటస్ట్‌ అండ్‌ ఆర్థోటిస్ట్, క్లినికల్‌ అసిస్టెంట్, స్పెషల్‌ ఎడ్యుకేటర్, వర్క్‌షాప్‌ సూపర్‌వైజర్, క్లర్క్‌.

► సీఆర్‌సీ, రాజ్‌నందగావ్‌(చత్తీస్‌గఢ్‌): పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌/ఓరియంటేషన్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్, ప్రొస్థెటిస్ట్‌ అండ్‌ ఆర్థోటిస్ట్, రిహేబిలిటేషన్‌ ఆఫీసర్‌.

అర్హత
► లెక్చరర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎంఫిల్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఏ, ఎంఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 45ఏళ్లు మించకూడదు.

► జూనియర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌: గ్రాడ్యుయేషన్, డిప్లొమా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌/బీఈడీ/బీఆర్‌ఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు మించకూడదు.

► స్టెనోగ్రాఫర్‌: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18–28ఏళ్లు మించకూడదు.

► ప్రిన్సిపల్‌: మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 45ఏళ్లు మించకూడదు.

► అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: ఎంబీబీఎస్, పీజీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 45ఏళ్లు మించకూడదు.

► ఓరియేంటేషన్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్‌: గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు.

► దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021
► వెబ్‌సైట్‌: https://niepid.nic.in

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top