
గర్షకుర్తి గ్రామస్తుల తీర్మానం
కరీంనగర్ జిల్లా: ఆదివారం వచ్చిందంటే మాంసం దుకాణాల వద్ద ప్రజలు పడి గాపులు కాస్తారు. ఆరోజు సెలవు దినం కావ డంతో పల్లెలు, పట్టణాల్లోని కుటుంబాలు మటన్, చికెన్ తినడానికి ప్రా«ధాన్యం ఇస్తుంటాయి. కాగా, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామస్తులు ఆదివారం పవిత్ర దినంగా భావిస్తూ ఆరోజు మటన్, చికెన్ తిన డం మద్యం తీసుకోవడం నిషేధించుకున్నారు. ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్ మార్చి 2 నుంచి గ్రామంలో మహాభారత, రామాయణంపై ప్రవచనాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం ప్రాముఖ్యతను వివరించారు. ఆదివారం ఆదిదేవుడు సూర్యభగవానుడి రోజని ఆరోజు మద్యం తాగరాదని, మాంసం తినవద్దని బోధించారు. దీంతో గ్రామస్తులు సమావేశమై ఆదివారం ఏ ఇంట్లో మద్యం తీసుకోవడం, మాంసం తినడం చేయరాదని తీర్మానించారు. ఈ విషయం ఇంటింటికీ వెళ్లి వివరించారు. మద్యం, మాంసం నిషేధంపై గ్రామ కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గర్షకుర్తిలో ఆదివారం ఎవరూ మద్యం, మాంసం ముట్టడంలేదు.