
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని హఠాత్తుగా రద్దు చేయడంతో ప్రయాణికులు అందోళనకు దిగారు.
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం(91879)లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే బోర్డింగ్ అనంతరం ఫ్లైట్ రద్దు అయినట్లు ప్రకటించారు. రెండు గంటలుగా ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు పడ్డ ప్రయాణికులు.. చివరకు ఆందోళనకు దిగారు. విమానంలో మొత్తం 147 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై అదనపు సమాచారం అందాల్సి ఉంది.