ఐఐటీహెచ్‌లో డార్క్‌ స్కై అబ్జర్వేటరీ 

Advanced Dark Sky Observatory Inaugurated At IIT Hyderabad - Sakshi

ప్రారంభించిన ఇస్రో మాజీ చైర్మన్‌ రాధాకృష్ణన్‌..   

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళశాస్త్రంలో ఉన్నతస్థాయి పరిశోధనలకు ఉపయోగపడే అడ్వాన్స్‌డ్‌ డార్క్‌ స్కై అబ్జర్వేటరీని హైదరాబాద్‌ ఐఐటీలో ఏర్పాటు చేశారు. నేషనల్‌ సైన్స్‌ డే మంగళవారం ఐఐటీలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇస్రో మాజీ చైర్మన్, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ కె.రాధాకృష్ణన్‌ ఈ అబ్జర్వేటరీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖగోళ శాస్త్ర పరిశోధనలకు ఈ అబ్జర్వేటరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌.మూర్తి, ఫిజిక్స్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎం పహారి, విద్యార్థులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top