కరోనా టెస్టులు లేకుండానే ఫలితాలొస్తున్నాయ్‌.. అదెలా

Adilabad: Staff Shows Mistakes In Corona Test Report Patients Panic - Sakshi

వైద్య సిబ్బంది నిర్వాకం

నివ్వెరపోయిన బాధితులు 

జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌ అర్బన్‌హెల్త్‌ సెంటర్‌కు సోమవారం ఉదయం ఐదుగురు వ్యక్తులు కరోనా నిర్ధారణ పరీక్ష కోసం వచ్చారు. వారికి ఆరోగ్య కేంద్ర సిబ్బంది టోకెన్లు అందజేసి మధ్యాహ్నం 12గంటలకు నమూనాలు సేకరిస్తామని చెప్పారు. దీంతో వారు వెనుదిరిగారు. అయితే కొంత ఆలస్యంగా మళ్లీ వారు ఆరోగ్య కేంద్రానికి చేరుకోవడం, అప్పటికే మిగితా వారికి పరీక్షలు పూర్తయ్యాయి. ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్ట్‌ కిట్లు అయిపోయాయని, రేపు రమ్మని సిబ్బంది చెప్పడంతో మరోమారు వారు వెనుదిరిగారు. సాయంత్రం వారి సెల్‌ఫోన్లకు పరీక్ష ఫలితాలు నెగిటివ్‌ అని రావడంతో నివ్వెరపోయారు’. అసలు పరీక్ష చేసుకోకముందు ఫలితం ఎలా వచ్చిందని విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితుల్లో నిర్ధారిత పరీక్షల్లో గందరగోళం నెలకొంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్నాయి.

ఆదిలాబాద్‌ టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని డిగ్రీ కళాశాల పక్కన గల శాంతినగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో కరోనా టెస్టుల్లో గందరగోళం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట వికలాంగుల కాలనీకి చెందిన ఓ ఉపాధ్యాయుడు పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని కలిశాడు. కరోనా సోకిందనే అనుమానంతో టెస్టు చేయించేందుకు అక్కడికి వచ్చాడు. పరీక్ష చేసిన తర్వాత వైద్య సిబ్బంది ఆయనకు నెగిటివ్‌ అని చెప్పారు. అనంతరం రాత్రి సమయంలో కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఫోన్‌కు మెస్సేజ్‌ వచ్చింది. దీంతో రాత్రంతా ఆయన భయాందోళనకు గురయ్యారు. ఉదయం శాంతినగర్‌ అర్బన్‌హెల్త్‌ సెంటర్‌లో రికార్డు చూడగా ఆయనకు నెగిటివ్‌గా వచ్చింది. పరీక్షలు చేయించుకున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు ఒకే విధంగా ఉండడంతో రిపోర్టు మారినట్లు తెలిసింది. అయినప్పటికీ భయంతో మరోమారు అక్కడే పరీక్ష చేసుకుంటే కరోనా నెగిటివ్‌ వచ్చింది. సోమవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని పలు కాలనీకి చెందిన ఐదుగురు వ్యక్తులు కరోనా పరీక్ష కోసం శాంతినగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఉదయం 10గంటలకు 50 నుంచి 54 వరకు వీరికి టోకెన్లు అందజేశారు. మధ్యాహ్నం రావాలని సిబ్బంది చెప్పడంతో వారు ఒంటిగంటకు వెళ్లారు. ఆ సమయానికి కరోనా టెస్టులు నిలిపివేయడం, వీరి నమూనాలను తీసుకోకపోవడంతో వారు వెనుదిరిగారు. అయితే సాయంత్రం సమయంలో ఆ ఐదుగురికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు ఫోన్‌లకు సంక్షిప్త సమాచారం అందింది. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

పునరావృతమవుతున్న ఘటనలు...
కరోనా పరీక్షల్లో కొంత గందరగోళం నెలకొంటుంది. కొంతమంది పరీక్షలు చేయించుకున్న తర్వాత ఫోన్‌కు మెస్సేజ్‌ రాకపోవడంతో ఆందోళనకు గురవుతుండగా, మరికొంత మందికి మొదట నెగిటివ్‌ అని చెప్పి.. ఆ తర్వాత పాజిటివ్‌ అంటూ మెస్సేజ్‌లు పంపుతున్నారు. ఏ సమాచారం నిజమో తెలియక బాధితులు తికతమక పడుతున్నారు. భీంపూర్‌ మండలానికి చెందిన ఓ గర్భిణులు ఇటీవల జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుంది. అక్కడ సిబ్బంది ఆమెకు నెగిటివ్‌ అని చెప్పారు. ఫోన్‌కు మాత్రం కరోనా పాజిటివ్‌ అని మెస్సేజ్‌ వచ్చింది. దీంతో ఆ గర్భిణి ఆందోళనకు గురైంది. ఉదయం పూటనే భీంపూర్‌ పీహెచ్‌సీలో మరోమారు కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా నెగిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ ఆమె గర్భిణి కావడంతో రిమ్స్‌లో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోగా అప్పుడు కూడా నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనా పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

పర్యవేక్షణ కరువు...
ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కరోనా పరీక్షలు చేయడం, కరోనా నివారణ టీకాలు వేయాల్సి ఉండగా, మధ్యాహ్నం 12గంటలకు కరోనా పరీక్షలు ప్రారంభించి ఒంటిగంట లోపు ముగిస్తున్నారు. టీకాలను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే వేస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండగా, వీరు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసమే నెగిటివ్‌ అని
కరోనా నిర్ధారణ పరీక్ష కోసం సేకరించిన నమూనాల్లో 20శాతం ఆర్టీసీపీఆర్‌ కోసం పంపడం జరుగుతుంది. ర్యాపిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ అని చూపించినప్పుడే ఆర్టీపీసీఆర్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో నమోదవుతోంది. అందుకోసమే నెగిటివ్‌ అనే రిపోర్టు పంపడం జరిగింది. 
– కిరణ్‌కుమార్, శాంతినగర్‌ యూపీఎహెచ్‌సీ వైద్యాధికారి 

( చదవండి: రెమ్‌డెసివిర్‌ కావాలంటే ఈ నంబర్‌కు వాట్సాప్‌ చేయండి )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 15:16 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం...
06-05-2021
May 06, 2021, 14:36 IST
జైపూర్‌: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మొదటి దశలో కంటే సెకండ్‌వేవ్‌లో వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని...
06-05-2021
May 06, 2021, 14:06 IST
యాదగిరిగుట్ట: కరోనాతో బాధపడుతూ భర్త.. గుండెపోటుతో భార్య మృతి చెందింది. ఈ   సంఘటన భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చోటు...
06-05-2021
May 06, 2021, 12:30 IST
వాషింగ్టన్: ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకట్టకు టీకాతోనే సాధ్యమని భావించి ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో...
06-05-2021
May 06, 2021, 11:43 IST
తిరువనంతపురం: కేరళలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కట్టడికి కేరళ...
06-05-2021
May 06, 2021, 09:59 IST
ఒట్టావ: ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ ను 12 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలకు టీకా వేసేందుకు కెనడా ఆరోగ్య...
06-05-2021
May 06, 2021, 08:06 IST
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్‌): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్‌లో ఉంటూ పాజిటివ్‌ దృక్పథంతో...
06-05-2021
May 06, 2021, 06:06 IST
జెనీవా (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్‌...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మూడురోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టిన రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసులు...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, విశాఖపట్నం: దేశంలో విజృంభిస్తున్న కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌పై జరుగుతున్న సమరంలో భారత నౌకాదళం ఓ అడుగు ముందుకేసింది. ప్రస్తుత...
06-05-2021
May 06, 2021, 05:27 IST
పుట్టపర్తి అర్బన్‌: కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట. పట్టణాలన్నీ వైరస్‌ బారిన పడినా.. కొన్ని పల్లెలు మాత్రం భద్రంగా...
06-05-2021
May 06, 2021, 05:24 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్‌ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో...
06-05-2021
May 06, 2021, 05:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా...
06-05-2021
May 06, 2021, 05:17 IST
తిరుమల: కరోనా నియంత్రణలో భాగంగా బుధవారం నుంచి రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల...
06-05-2021
May 06, 2021, 04:33 IST
కర్నూలు (హాస్పిటల్‌): కోవిడ్‌ బాధితుల్లో కొందరు శరీరంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని కాపాడుకునేందుకు నిమిషానికి...
06-05-2021
May 06, 2021, 02:54 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి సకాలంలోనే రెండో డోసు వేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి...
06-05-2021
May 06, 2021, 01:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కారణంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో...
06-05-2021
May 06, 2021, 01:05 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలో ఉన్నాయి. లాక్‌డౌన్‌తో ఉపయోగం లేదని నమ్ముతున్నాం. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించినా...
06-05-2021
May 06, 2021, 01:05 IST
ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు స్టాక్‌ మార్కెట్‌ను...
06-05-2021
May 06, 2021, 00:57 IST
ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top