World No Tobacco Day 2021: దమ్ము కొడితే.. దుమ్ములోకే..

Adilabad: Miners Addicted To Cigarettes - Sakshi

సిగరెట్లకు బానిసవుతున్న మైనర్లు

విచ్చలవిడిగా గుట్కా విక్రయాలు

నేడు పొగాకు వ్యతిరేక దినం

సాక్షి, నిర్మల్: ఆధునిక కాలంలో ధూమపానం ఒక ఫ్యాషన్‌గా మారింది. ఆడా మగ తేడా లేకుండా నేటి యువత మత్తుకు బానిస అవుతున్నట్లు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి పొగాకుతో పాటు మరికొన్ని మత్తుపదార్థాలు కలిపి ధూమ పానం చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో ఊపిరితిత్తుల సమస్యలు, ఉబ్బసం గ్యాస్ట్రిక్, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాక్షి కథనం. 

1987 నుంచి... 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1987 నుంచి ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తున్నారు. పొగాకు అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.నేడు పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ  పిలుపునిచ్చింది. 

ఆకు చుట్ట నుండి గుట్కా వరకు.. 
నాలుగు దశాబ్దాల క్రితం పొగాకు ఎండబెట్టి శుభ్రపరిచి దానిని పాయలుగా విడదీసి ఎండిన ఆకుల్లో చుట్టి గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు అక్కడక్కడ మహిళలు పీలుస్తుండేవారు. కాలక్రమంలో పొగాకు చుట్టాల స్థానంలోకి బీడీలు చేరాయి. ఆతర్వాత ఫ్యాషన్‌గా సిగరెట్లు తేలాయి. పొగాకు అలవాటు మనిషి జీవన కాలాన్ని తగ్గిస్తుంది. ఒక సిగరెట్‌ తాగడం వల్ల 11 నిమిషాల ఆయుష్షు తగ్గుతుంది. పొగ తాగే వాళ్ళు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు వ్యాధులు సోకే అవకాశం లేకపోలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top