దక్షిణ మధ్య రైల్వేలో 31 రైల్వే స్టేషన్లు మూత!

31 Railway Stations Closed In South Central Railway - Sakshi

ఆదాయం తక్కువ ఉండటంతో రైల్వే నిర్ణయం 

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు 

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయం లేని కొన్ని రైల్వే స్టేషన్లను మూసేయాలని, రోజులో ఒకట్రెండు ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే ఆగే స్టేషన్లపై వేటు వేయాలని రైల్వే నిర్ణయించింది. ఆదాయం కంటే నిర్వహణ ఖర్చే అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 31 స్టేషన్లు మూతపడనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో 16, హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో 7 స్టేషన్లు ఉన్నాయి. గుంతకల్‌ డివిజన్‌ పరిధిలో 3, గుంటూరు డివిజన్‌ పరిధిలో 4, నాందేడ్‌ డివిజన్‌ పరిధిలో ఒకటి ఉన్నాయి. 

ఇవీ కారణాలు.. 
పెద్ద స్టేషన్లతో పాటు కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో కూడా రైల్వే శాఖ చిన్న స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈ స్టేషన్లలో స్టేషన్‌ మాస్టర్‌ ఉండరు. సిగ్నలింగ్‌ వ్యవస్థ కూడా ఉండదు. ఒక చిన్న గది, చిన్న బుకింగ్‌ సెంటర్‌ మాత్రమే ఉంటుంది. టికెట్లను కూడా ప్రైవేటు సిబ్బందే జారీ చేస్తుంది. వారు కూడా రోజులో కొంత సమయమే ఉండి టికెట్లు జారీ చేసి వెళ్లిపోతారు. ఒకటి లేదా రెండు ప్యాసింజర్‌ రైళ్లు అర నిమిషం ఆగి వెళ్లిపోతాయి. ఇలాంటి స్టేషన్లలో కొన్నింటికి పెద్దగా ప్రయాణికుల నుంచి స్పందన ఉండట్లేదని తాజాగా రైల్వే గుర్తించింది. సాధారణంగా సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం, లేదా లక్ష మంది ప్రయాణికులు ఉంటే స్టేషన్‌ను నిర్వహిస్తారు. అంతకంటే తక్కువ నమోదవుతుంటే వాటి నిర్వహణ అనవసరమని రైల్వే భావిస్తుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top