‘న్యూడ్‌’.. న్యూసెన్స్‌! అందంతో టెంప్ట్‌ చేసి.. ఆపై టార్చర్‌..

10 Honey Trap  Cases Filed In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: న్యూడ్‌ కాల్స్‌ న్యూసెన్స్‌ చేస్తున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో.. అదే స్థాయిలో సైబర్‌ క్రిమినల్స్‌ కూడా మరింతగా అప్‌డేట్‌ అవుతున్నారు. వాట్సాప్‌ ద్వారా నేరుగా వీడియో కాల్స్‌ చేస్తున్న యువతులు ఆ ఫోన్‌ వినియోగదారుడిని టెంప్ట్‌(ప్రేరేపిస్తూ) చేసి.. వారిని కూడా వివస్త్రలు కావాలని చెప్పి మరీ ఆ సీన్‌ను వీడియో రికార్డు చేస్తున్నారు.

ఆ తర్వాత వారు మొదలు పెట్టే అసలు ఆటలో ఈ విషయాలు బయటకు చెప్పుకోలేక రూ.లక్షలు సమర్పించుకుంటున్నారు. ఇంకొందరు ఈ వేధింపులు తారస్థాయికి చేరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ గడపతొక్కుతున్నారు. మరికొందరేమో తమ పరిధిలోని ఠాణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పదికి పైగా కేసులు కూడా నమోదయ్యాయి. 

అందంతో టెంప్ట్‌ చేసి.. ఆపై టార్చర్‌..
అదిరే డ్రెస్సు.. ఆకర్షించే అందచందాలతో చూడచక్కగా ఉండే యువతులు వాట్సాప్‌ ద్వారా వీడియో కాల్స్‌ చేస్తున్నారు. ఇలా వీడియో కాల్‌ రాగానే.. ఇటు నుంచి యువకులు కూడా వారు చెప్పే మా టలకు ఫిదా అవుతున్నారు. ఓ అమ్మాయి నేరుగా వీడియో కాల్‌ చేయడంతో ఉబ్బితబి్బబ్బవుతున్నా రు. ఆ తర్వాత మాటల్లోకి దింపి సదరు యువతి డ్రెస్‌ తీసేసి ఇటువైపు నుంచి ఉన్న యువకులను టెంప్ట్‌ చేస్తుంది. మీరు కూడా బాత్‌రూమ్‌కు వెళ్లి బ ట్టలు తీసేయండి అంటూ చెప్పడంతో ఆ మోజులో చాలా మంది అలానే చేస్తున్నారు. ఈ సమయంలో సదరు యువతి మాటలతో రెచ్చగొట్టి యువకులు చేసే సీన్‌లను వీడియో రికార్డు చేస్తున్నారు. 

పోలీసుల పేరుతో కాల్స్‌..
ఇక్కడ్నుంచి నేరస్తుల అసలు కథ మొదలవుతుంది. వీడియో కాల్‌ పూర్తయ్యాక.. కాసేపటికి బాధితుడికి ఓ ఫోన్‌ కాల్‌ వస్తుంది. ఢిల్లీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ, సీఐని మాట్లాడుతున్నానని.. మీతో న్యూడ్‌ వీడియో కాల్‌ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని సదరు బాధితుడిని బెదిరిస్తారు. ఢిల్లీలో కేసు నమోదైందని.. అరెస్ట్‌ చేస్తామని హెచ్చరిస్తారు. అమ్మా యి సెల్‌ఫోన్‌న్‌వీడియోల రికార్డ్‌ అంతా రికవరీ చేశామంటారు.

ఆ వీడియో సదరు యువకులకే పంపడంతో నిజమేనని నమ్మేస్తారు. కేసులు, తలనొప్పులు లేకుండా ఈజీగా బయటపడాలంటే కొంత డబ్బు పంపించాలని కొరతారు. కొందరు అధికారులను మేనేజ్‌ చేయాల్సి ఉందని నమ్మబలుకుతారు. ఇలా విడతలవారీగా రూ.లక్షల్లో డబ్బులను ఆన్‌లైన్‌లో కొందరు బాధితులు సమర్పించుకున్నారు. ఈ విధంగా వరంగల్‌లోని 36వ డివిజన్‌ చింతల్‌కు చెందిన ఓ వ్యక్తికి అనుభవం ఎదురుకావడంతో పోలీసులను ఆశ్రయించాడు. 

ఆ వీడియో కాల్స్‌కు స్పందించొద్దు..
సైబర్‌ నేరగాళ్ల ముసుగులో కొందరు యువతులు వీడియో కాల్స్‌ చేసి తియ్యటి మాటలతో నగ్నంగా ఉండి టెంప్ట్‌ చేసి ఆ తర్వాత బెదిరించి డబ్బు వసూలు చేసే కేసులు పెరుగుతున్నాయి. సమాజంలో గౌరవం ఉన్నవారు బయటకు చెప్పుకోలేక పీకల్లోతు వేధింపులు వచ్చాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా న్యూడ్‌ వీడియో కాల్స్‌కు స్పందించకపోవడమే మంచిది. ఒకవేళ అలాంటివి ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలి. నిందితులను టెక్నికల్‌ డాటా ఆధారంగా పట్టుకునే అవకాశం ఉంటుంది.
– ఏవీ రంగనాథ్, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top