Local Train: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన రైలు.. ప్రయాణికుల పరుగులు | Local Train Lost Control And Climbed Over The Platform | Sakshi
Sakshi News home page

Local Train: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన లోకల్‌ ట్రైన్‌.. ప్రయాణికుల పరుగులు

Apr 24 2022 6:23 PM | Updated on Apr 24 2022 6:24 PM

Local Train Lost Control And Climbed Over The Platform - Sakshi

సబర్బన్‌ రైలు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని బీచ్‌ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, చెన్నై వర్క్‌షాప్‌ నుంచి కోస్టల్‌ రైల్వేస్టేషన్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్‌ వైపుపైకి దూసుకోచ్చింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణీకులందరూ పరుగులు పెట్టారు. రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు సైతం రైలు నుంచి బయటకు దూకారు.

ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్‌ మాత్రం గాయపడగా వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement