ఇదో దుర్భరమైన పాలన.. | - | Sakshi
Sakshi News home page

ఇదో దుర్భరమైన పాలన..

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

● రోజుకో హత్య జరుగుతోంది.. ● ప్రభుత్వంపై పళనిస్వామి ఫైర్‌

సాక్షి, చైన్నె: తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో రోజుకో హత్య జరగని రోజంటూ లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సేలంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతటీవీకే ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఒక దుర్భరమైన పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. టీవీకే ప్రభుత్వం తన కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొని శాంతిభద్రతలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వం నడుస్తోందో లేదో కూడా తెలియడం లేదు అంటూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ పళనిస్వామి వ్యాఖ్యాల తూటాలను పేల్చారు.

రీల్స్‌ ప్రభుత్వం

ఈ ప్రభుత్వం రీల్స్‌ చేయడంపై ఉన్న నమ్మకంతోనే నడుస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్లో చాలా వరకు నెరవేర్చలేదని మండి పడ్డారు.ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క ప్రధాన ప్రాజెక్టును కూడా సీఎం విజయ్‌ ప్రకటించలేదన్నారు. అసలు ప్రభుత్వం పనిచేస్తుందో లేదో కూడా ప్రజలకు అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే సీఎం క్యాంప్‌ కార్యాలయం సమీపంలోనే హత్యలు జరుగుతున్నాయంటే శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దీపావళి రోజున ఏకంగా 11 హత్యలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల నుంచి నగరాల వరకు గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో నేరగాళ్లకు పోలీసులంటే భయం లేకుండా పోయిందని, స్వయంగా పోలీసులకే భద్రత లేని వాతావరణం నెలకొందని పళనిస్వామి పేర్కొన్నారు. టీవీకే ఎమ్మెల్యే ఒకరు మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇంతవరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని, తప్పు చేసిన వారిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement