సాక్షి, చైన్నె: ప్రముఖ సీనియర్ లివింగ్, వెల్నెస్ ఎకోసిస్టమ్ అయిన లైఫ్‌బ్రిడ్జ్ గ్రూప్ రూపొందించిన ఏజ్‌టెక్ ప్లాట్‌ఫామ్ సీనియర్‌షీల్డ్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకుంది. 18వ ఫిక్కీ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డులు 2026లో టెక్నాలజీ ట్రానన్స్‌ఫర్మేషన్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నట్లు సంస్థ వర్గాలు ప్రకటించాయి.వివిధ కేటగిరీల నుంచి వచ్చిన దాదాపు 200లకు పైగా నామినేషన్లతో పోటీపడి సీనియర్‌షీల్డ్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. ఎంపీ డాక్టర్ శశి థరూర్ చేతుల మీదుగా లైఫ్‌బ్రిడ్జ్ గ్రూప్ ప్రొడక్ట్ – టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ ఆర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ గుర్తింపుపై లైఫ్‌బ్రిడ్జ్ గ్రూప్ వీపీ అర్జున్ ఆర్ మాట్లాడుతూ.. వృద్ధుల సంరక్షణలో సాంకేతికత ఉపయోగం అనేది వారికి ఎంతవరకు మెరుగైన సేవలను అందిస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. వృద్ధుల నిజమైన అవసరాలకు అనుగుణంగా, వారి సంరక్షకులకు స్పష్టమైన మద్దతు ఇచ్చేలా సీనియర్‌షీల్డ్‌ను డిజైన్ చేశామన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం తమ టీమ్‌కు ఎంతో గర్వకారణం అని తెలిపారు.


